కమలేష్‌ హత్య కేసు:ముగ్గురి అరెస్టు

కమలేష్‌ హత్య కేసు:ముగ్గురి అరెస్టు

లక్నో: హిందూ సమాజ్ నేత కమలేష్ తివారీ దారుణ హత్య కేసులో ముగ్గురు వ్యక్తుల్ని ఉత్తర ప్రదేశ్, గుజరాత్ సంయుక్త పోలీసు బృందం శనివారం అరెస్టు చేసింది. హత్యలో తమ ప్రమేయం ఉన్నట్టు నిందితులు అంగీకరించినట్లు పోలీసు డైరెక్టర్ జనరల్ ఓపీ సింగ్ తెలిపారు. 2015లో తివారీ చేసిన ఒక ప్రసంగంలో కొన్ని వ్యాఖ్యల వల్లే ఈ హత్య చేసినట్లు వెల్లడైందన్నారు. గుజరాత్లో అరెస్టు చేసిన నిందితులను మౌలానా మొహసిన్ షేక్ (24), ఖుర్షీ ద్ అహ్మద్ పఠాన్ (23), ఫైజన్ (21)గా గుర్తించినట్టు చెప్పారు. తివారీ హత్యకు ఖుర్షీద్ పఠాన్ వ్యూహం పన్నగా, మౌలానా మొహసిన్ ఈ కుట్రను ప్రోత్సహించినట్లు తెలిపారు. ఈ హత్య తో ఏ ఉగ్రవాద సంస్థకు సంబంధాలున్నట్లు తెలియరాలేదన్నారు. దీని పై మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం తివారీ హత్యకు గురయ్యారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos