వైసీపీ వైపు తోట నరసింహం చూపు…

వైసీపీ వైపు తోట నరసింహం చూపు…

గోరు చుట్టుపై రోకటిపోటు చందాన తయారైంది అధికార తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి.ఒకవైపు రాజకీయాల్లో తన కుమారుడు లొకేశ్‌ రాణించలేకపోతుండడంపై గుబులు చెందుతున్న చంద్రబాబును టిక్కెట్ల కోసం కుమ్ములాటలు,ముఖ్యంగా తెదేపా నుంచి వైసీపీలోకి కొనసాగుతున్న వలసలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కుటుంబ స్నేహితులు,నియోజకవర్గాల్లో కీలకనేతలు తెదేపాను వీడి వైసీపీలో చేరిపోయారు. తాజాగా మరో తెదేపా ఎంపీ వైసీపీ వైపు చూస్తున్నట్లు వినిపిస్తున్న వార్తలు చంద్రబాబును మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి.కొద్ది రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎంపీ వైసీపీలో చేరగా తాజాగా అదే జిల్లాకు చెందిన కాకినాడ ఎంపీ తోట నరసింహ కూడా వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కొద్ది కాలంగా తనకు ఆరోగ్య పరమైన సమస్యలు ఉన్నాయని ఈసారి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయలేనని తనకు బదులుగా తన భార్య తోట వాణికి జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని చంద్రబాబును అడిగారట.జగ్గంపేటలో గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున జ్యోతులనెహ్రూ నెగ్గిన సంగతి తెలిసిందే. ఆయన తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు జ్యోతుల నెహ్రూను పక్కన పెట్టి… తోట నరసింహం కుటుంబానికి ప్రాధాన్యతను ఇవ్వడానికి సంశయిస్తున్నారట.జ్యోతుల నెహ్రూను కాదని చంద్రబాబు తోట నరసింహం కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారా అనేది సందేహంగానే కనిపిస్తోంది.ఒకవేళ తమకు జగ్గంపేట టికెట్ ఖరారు కాకపోతే.. తెలుగుదేశం పార్టీని వీడటానికి తోట నరసింహం కుటుంబం రెడీగా ఉందని వార్తలు వస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos