ఈ సొరకాయ రేటు అక్షరాలా రెండు కోట్లు..

ఈ సొరకాయ రేటు అక్షరాలా రెండు కోట్లు..

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడకు వచ్చే భక్తుల నమ్మకాలను క్యాష్ చేసుకుని కేవలం రూ.10 కూడా పలకని సొరకాయలను ఏకంగా లక్షలు, కోట్ల రూపాయలకు అంటగట్టేస్తున్నారు కొందరు కేటుగాళ్లు.ఇలాంటి వారిలో 21 మందిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. సొరకాయలకు మహిమలు ఉన్నాయంటూ నమ్మించి భక్తులకు శఠగోపం పెడుతున్నారు. వారంతా ఓ ఆశ్రమంలో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. మామూలుగా దొరికే సొరకాయలను తాము ఒక్కొక్కటి లక్షల రూపాయలకు అమ్మినట్టు నిందితులు పోలీసుల ఎదుట అంగీకరించారు.వీటిని నాగ సొరకాయలు అంటారు. ఇవి ఎక్కడపడితే అక్కడ పండేవి కావని, కేవలం శ్రీశైలం మల్లికార్జునుడు కొలువైన నల్లమల అడవుల్లో మాత్రమే లభిస్తాయంటూ వారు భక్తులను నమ్మిస్తారు. ఈ సొరకాయ ఇంట్లో ఉంటే ఎంతో మంచిది. అంటూ శ్రీశైలం వచ్చే భక్తులను నమ్మిస్తారు. మీకు కావాలంటే తక్కువకే అందిస్తామంటూ ఆఫర్లు ఇస్తారు.ఏ సొరకాయలో ఏముందో అనుకునే భక్తులు కొందరు వీటిని కొనే అవకాశం కూడా ఉంది. భక్తుల ఆర్థిక స్థోమతను బట్టి ఏకంగా రూ.కోటి, రూ.2కోట్ల వరకు కూడా ఒక్కో సొరకాయను విక్రయిచినట్టు పోలీసులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos