మాకు కూడా చలేస్తుంది..

మాకు కూడా చలేస్తుంది..

వర్షాల జోరుకు దేశంలోని చాల రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి.లాక్ డౌన్ కారణంగా వాయు కాలుష్యం సైతం తగ్గడంతో చలి కూడా విపరీతంగా ఉంటోంది.దీంతో ప్రతీ ఒక్కరు ఇళ్లల్లో ముసుగులు తన్ని పడుకుంటున్నారు.అయితే చలి మనుషులను మాత్రమే కాదు పెంపుడు జంతువులను సైతం వణికిస్తోంది.ఈ క్రమంలో మూడు పిల్లులు కూడా చలికి తట్టుకోలేక దుప్పటి కప్పుకొని పడుకున్నాయి.అందుకు సంబంధించి వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.14 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో మూడు పిల్లులు హ‌త్తుకొని నిద్ర‌పోతున్నాయి. మెత్త‌టి బెడ్‌షీట్ క‌ప్పుకొని హాయిగా నిద్ర‌పోతున్నాయి. మ‌ధ్య‌లో బెడ్‌షీట్ తెరిచి చూస్తే నిద్ర‌కు భంగం క‌లిగిన‌ట్లుగా క‌దిలాయి. ఈ వీడియోను వెల్‌క‌మ్ టు నేచ‌ర్ షేర్ ఖాతా షేర్ చేసింది. ‘ఒక దుప్ప‌టిలో మూడు కిట్టీలు’ అనే శీర్షిక‌ను జోడించింది. ఇది కాస్త వైర‌ల్ అవ్వ‌డంతో ల‌క్ష‌కు పైగా వీక్ష‌ణ‌ల‌ను సంపాదించుకున్న‌ది. ఈ వీడియోను సోమ‌వారం బ‌ద్ద‌కాన్ని మాయం చేస్తుంది అంటున్నారు నిపుణులు.

తాజా సమాచారం