పోటీ నుంచి తప్పుకోలేదు

పోటీ నుంచి తప్పుకోలేదు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న పోటీ నుంచి తాను విరమించుకునే ప్రసక్తే లేదని శశి థరూర్ స్పష్టం చేశారు. పోటీ నుంచి తప్పుకున్నట్లు ఢిల్లీ వర్గాలు చెప్పాయంటూ ప్రచారమవుతున్నవన్నీ వదంతులేనన్నారు. వీటి గురించి కొందరు ఫోన్ చేసి చెప్పడంతో ఆశ్చర్యపోయానని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు ఈ నెల 17న జరుగుతాయి. ‘‘నేను మీకు ఓ హామీ ఇస్తున్నాను. నేను సవాల్ నుంచి వెనుకకు తగ్గేది లేదు. నా జీవితంలో ఎన్నడూ అలా వెనుకకు తగ్గలేదు, ఇకపై కూడా తగ్గబోను’’ అని వీడియో సందేశంలో తెలిపారు. ‘ఇది పోరాటం. స్నేహపూర్వక పోటీ. పార్టీలోపలే ఈ పోటీ జరుగుతోంది. పోటీ చివరి వరకు కొనసాగుతుంది. చివరి వరకూ బలంగా ముందుకెళతా. ఈ నెల 17న నాకు ఓటు వేయండి. రేపటి గురించి ఆలోచించాల’ని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos