సామూహిక కాల్పుల్లో 34 మంది మృతి

సామూహిక కాల్పుల్లో 34 మంది మృతి

బ్యాంకాంక్‌: నన్గుభా లంఫులో ఒక డే కేర్ సెంటర్‌లో మాజీ పోలీసు అధికారి పన్య కమ్రబ్‌ జరిపిన తుపాకీ కాల్పుల్లో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 22 మంది చిన్నారులు. 12 మంది గాయపడ్డారు. కాల్పులు తర్వాత తనను తాను కాల్చుకుని  ప్రాణాలు తీసుకున్నాడు. కాల్పుల్లో ఆయన భార్యా, బిడ్డ ప్రాణాలూ  పోయాయి. మత్తు మందులకు బానిసయ్యాడనే కారణంగా పోలీసు ఉద్యోగం నుంచి అతనిని తొలగించినట్లు సమాచారం. కాల్పుల్లో చనిపోయిన వారిలో ఎనిమిది నెలల గర్భిణి కూడా ఉంది. ఆమె ఆ డే కేర్ సెంటర్‌లో టీచర్‌.  తొలుత టపాసుల మోత అని అంతా అనుకున్నారు. ఆ తర్వాత కాల్పుల మోతతో ఆ ప్రాంతం దద్ధరిల్లింది. ఈ మారణ హోమంతో థాయ్‌లాండ్ ఉలిక్కిపడింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos