ఉగ్ర దాడిలో 27 మంది జవాన్ల మృతి

ఉగ్ర దాడిలో 27 మంది జవాన్ల మృతి

పుల్వామా : జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. 2004 తర్వాత అతి పెద్ద ఉగ్ర దాడిగా భావిస్తున్న ఈ సంఘటనలో 27 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరు మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.  పుల్వామా జిల్లాలో  సీఆర్‌పీఎఫ్‌ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ, ఐఈడీ బాంబులతో గురువారం దాడులకు తెగబడ్డారు. అవంతిపొరలోని గొరిపొరలో ముందుగా కాల్పులు జరిపి అనంతరం ఐఈడీ బాంబులు పేల్చారు.  సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు జమ్ము నుంచి శ్రీనగర్‌కు వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్‌ (జేఈఎం) ప్రకటించింది. ఉగ్రవాదుల ఏరివేత కోసం భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos