తెలుగు రాష్ట్రాలే లక్షంగా బీజేపీ స్కెచ్‌లు..

తెలుగు రాష్ట్రాలే లక్షంగా బీజేపీ స్కెచ్‌లు..

భారతదేశం మొత్తం తమ అధీనంలోకి వస్తున్నా దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు తమ చేతికి అందకుండా కొరకరాని కొయ్యాల మారడంతో తెలుగు రాష్ట్రాలను ఎలాగైనా కాషాయం నీడలోకి తీసుకురావడానికి బీజేపీ అధిష్టానం వ్యూహాలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.2024 ఎన్నికల నాటికి తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేయడమే లక్షంగా అధిష్టానం ప్రణాళికలు సిద్ధం చేసింది.అందులో భాగంగా మొదటగా లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా నాలుగు సీట్లు గెలుచుకోవడంతో ఇదే ఊపుతో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి ఆపరేషన్‌ మొదలుపెట్టింది. తెరాస అధినేత కేసీఆర్‌ దెబ్బకు తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్‌ అధికార పక్షంలో విలీనమైపోయింది. ఇదే అదునుగా భావించిన బీజేపీ అధిష్టానం కాంగ్రెస్‌లో సీనియర్‌ నేతలను,ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలను బీజేపీలో చేర్చుకోవడానికి కసరత్తులు మొదలుపెట్టింది.అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నేత,మాజీ హోంమంత్రి కొడుకును బీజేపీ లాగేయడానికి స్కెచ్ గీసినట్టు సమాచారం.దీంతోపాటు కరీంనగర్ కు చెందిన సీనియర్ మాజీమంత్రిని కూడా బీజేపీ సంప్రదింపులు జరిగినట్టు సమాచారం.ప్రస్తుతానికి ఈ ఇద్దరిని టార్గెట్ చేసి బీజేపీ ఆపరేషన్ కాంగ్రెస్ ను చేపట్టబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే డీకే అరుణ సహా  టీఆర్ ఎస్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని చేర్చుకున్న బీజేపీ అధిష్టానం ఇప్పుడు కాంగ్రెస్ టార్గెట్ గా తెలంగాణలో ముందుకెళ్తుండడం గమనార్హం.ఇలా తెలంగాణ కాంగ్రెస్‌లో కీలకమైన సీనియర్‌ నేతలతో పాటు యువ నేతలను కూడా బీజేపీలో చేర్చుకొని 2024 ఎన్నికల నాటికి తెలంగాణలో కాంగ్రెస్‌కు పూర్తిగా కనుమరుగు చేసి తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి వ్యూహాలు సిద్ధం చేసింది.మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా బీజేపీని వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం చేయడానికి అధిష్టానం కంకణం కట్టుకుంది.అందు కోసం ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి బలహీనపడ్డ తెలుగుదేశం పార్టీని మరింత బలహీనం చేసి తెదేపా స్థానాన్ని ఆక్రమించడానికి స్కెచ్‌ గీసినట్లు తెలుస్తోంది.అందులో భాగంగా తెదేపా ఎంపీ కేశినేని నానిని తనవైపు లాక్కునే ప్రయత్నాలు చేసి అందులో సఫలీకృతమైందనే వార్తలు వినిపిస్తున్నాయి.బీజేపీ ప్రోద్బలంతోనే కేశినేని నాని తెదేపా అధినేత చంద్రబాబుకు ఎదురు తిరిగారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos