కొత్త పురపాలక చట్టానికి శ్రీకారం..

కొత్త పురపాలక చట్టానికి శ్రీకారం..

 నగరాలు,పట్టణాల్లో అక్రమ కట్టడాలకు,అవినీతికి ఆస్కారం లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి కొత్త పురపాలక చట్టానికి శ్రీకారం చుట్టారు. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించేలా, ప్రణాళికబద్దంగా అభివృద్ధి జరిగేలా నగరాలు,పట్టణాలు రెవెన్యూ విధానాలతో పాటు కార్పోరేషన్ల కోసం కొత్త చట్టం రూపకల్పన చేయాలంటూ సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.కొత్తగా రూపొందించిన పురపాలక చట్టానికి ఆమోదం తెలిపేందుకు ఈనెల18,19వ తేదీల్లో ప్రత్యేకంగా రెండురోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించడానికి నిర్ణయించుకున్నారు.మొదటిరోజు సభలో బిల్లును ప్రవేశపెట్టి చర్చించిన అనంతరం మరుసటి రోజే బిల్లుకు ఆమోదం తెలపనున్నారు.అదేరోజే శాసన మండలిలో కూడ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదింప చేసుకోనున్నారు.కొత్త చట్టాల ప్రకారమే నగర పాలన జరిగే విధంగా నిర్ణయం తీసుకోనున్నారు.. క్రమంలో అధికారులకు, నేతలకు బాధ్యతలు అప్పగించబోతున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు.ఇందుకోసం ఇప్పటికే రూపోందించిన ముసాయిదా బిల్లును న్యాయశాఖకు పంపించిన ప్రభుత్వం చర్చ అనంతరం నూతన చట్టాన్ని తీసుకురానుంది.ఇప్పటికే పురపాలక ఎన్నికలు జరగాల్సి ఉండగా కొత్త చట్టం కోసం అనంతరమే వీటిని నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది.దీంతో కొద్ది రోజుల్లో జరగనున్న మున్సిపాలిటి ఎన్నికలు కొత్త చట్టం ప్రకారం కొనసాగనున్నాయి.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos