బెజవాడలో తెలుగు రచయితల మహాసభలు

బెజవాడలో తెలుగు రచయితల మహాసభలు

విజయవాడ: కృష్ణా జిల్లా రచయితల సంఘం సహకారంతో  ఈ నెల 27,28,29లలో నగరంలో ప్రపంచ తెలుగు రచయితల సంఘం మహాసభలు జరగనున్నాయి. తెలుగువారి భాషా సంస్కృతులు, చరిత్ర, మరియు సాంకేతిక ప్రగతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించటం, వివిధ విశ్వవిద్యాలయాల పరిథిలో నివసిస్తున్న జాతుల భాషల పరిరక్షణ కోసం“మాతృ భాషల పీఠాలు” ఏర్పాటు. తెలుగు మరియు ఇతర మాతృభాషల అభివృద్ధికి పాటుపడేందుకు స్పష్టమైన అధికారాలతో రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు ప్రాధికార సంస్థల నిర్మాణం, వాటి విధి విధానాల రూపకల్పన. అనేక రాష్ట్రాలలో అధికారభాషగా ఉన్న హిందీ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలనే తెలుగుభాష విషయంలోనూ అనుస రింప చేయటం. రేపటి అవసరాల ప్రాతిపదికగా తెలుగు భాషాబోధన, పాఠ్యాంశాల రూపకల్పన. ఆధునిక సాంకేతిక రంగంలో తెలుగు వినియోగం, యూని కోడ్, పదకోశాల అభివృద్ధి. తెలుగు చదివే విద్యార్థులు, బోధించే భాషా పండితుల సమస్యలు, ప్రోత్సాహాకాలు. వివిధ రాష్ట్రాలలో, దేశాలలో జీవిస్తున్న తెలుగువారి జీవనం, తెలుగు భాషా సంస్కృతులను కాపాడుకో వ టంలో వారు భాష పరంగా ఎదుర్కొం టున్న సమస్యలు. తెలుగేతర ప్రాంతాల్లోని తెలుగు వారికి హిందీ ప్రాధమిక, మాధ్యమిక పద్ధతిలో సర్టిఫికెట్ కోర్సుల నిర్వహణ. నిరాదరణకు గురౌతున్న గ్రంథాలయ వ్యవస్థ మరియు గత ఐదేళ్లుగా ఆగిపోయిన పుస్తకాల కొనుగోళ్లు.  తెలుగు భాషా పీఠా న్ని మైసూరు నుంచి తెలుగు నేలమీదకు తరలింపు తదితరాలు చర్చనీయాంశాలని సంస్థ కార్యదర్శి పూర్ణచందు బుధ వారం ఇక్కడ తెలిపారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos