జనాన్ని వంచించిన జెజిపి

జనాన్ని వంచించిన జెజిపి

చండీగఢ్: ప్రభుత్వం ఏర్పాటు కోసం భాజపాతో చేయి కలిపిన జన్ నాయక్ జనతా పార్టీ ( జెజిపి) అధినేత దుష్యంత్ చౌతాలా ప్రజలను మోసగిం చారని జేజేపీ నేత, బీఎస్ఎఫ్ మాజీ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ విమర్శించారు. ఇందువల్ల తాను పార్టీని వీడుతున్నట్లు శనివారం ఇక్కడ ప్రకటించారు. ‘భాజపాతో చేతులు కలిపి దుష్యంత్ చౌతాలా ప్రజలను మోసం చేశారు. ఏ పార్టీనైతే ప్రజలు వద్దనుకున్నారో ఆ పార్టీకే చౌతాలా స్వయం గా మద్దతు ప్రకటించార’ని మండి పడ్డారు. జవాన్లకు ఇస్తున్న నాసిరకం ఆహారాన్ని 2017లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఎక్కంచి నందు కు ఆయన్ను సేవల నుంచి తొలగించారు. దరిమిలా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన నిరుటి సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ ఉమ్మడి అ భ్యర్థిగా ప్రధాని మోదీపై పోటీకి దిగారు. ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. అనంతరం దుష్యంత్ చౌతాలా సమక్షంలో జేజేపీలో చేరి తాజా ఎన్నికల్లో మనోహర్ లాల్ ఖట్టర్పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

తాజా సమాచారం