మొదటిరోజే మాటలదాడి..

మొదటిరోజే మాటలదాడి..

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి.మొదటిరోజే అధికార,ప్రతిపక్షాల నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌,ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మధ్య మాటల యుద్ధం హోరాహోరీగా సాగింది.ప్రధానంగా నీటి ప్రాజెక్టుల అంశంపైనే ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం సాగింది.సభ ప్రారంభం కాగానే ప్ర‌శ్నోత్త‌రాల స‌మయంలో మంత్రి అనిల్ పోల‌వ‌రం ప్రాజెక్టు గురించి వివ‌రించారు.ఈ స‌మ‌యంలో టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో  తెలంగాణలో ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించిన వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే గతంలో తానే వ్యతిరేకించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి ఎలా వెళ్లారంటూ ప్రశ్నించారు.దీనిపై స్పందించిన  సీఎం వైఎస్‌ జగన్‌ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ వల్ల ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయమే జరిగితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు.కర్ణాటక రాష్ట్ర కృష్ణ నదిపై నిర్మించిన ఆల్మ‌ట్టి కరకట్ట ఎత్తు 519 మీట‌ర్ల నుండి 524 మీట‌ర్ల‌కు పెంచు కుంటూ పోతుంటే అప్పుడు చక్రం తిప్పుతున్న చంద్ర‌బాబు ఏం చేశార‌ని జ‌గ‌న్ ప్రశ్నించారు. కేసీఆర్‌తో స‌త్సంబంధా ల‌తో ముందుకు వెళ్తున్నామ‌ని..కాళేశ్వ‌రం ప్రాజెక్టు తాను వెళ్లినా..వెళ్ల‌కున్నా ఆరంభం అవుతుంద‌ని పేర్కొన్నారు. నీటి వివాదాలపై కోర్టుకు వెళ్తే ప‌రిష్కారం ల‌భించ‌వ‌ని..ఇద్ద‌రి మ‌ధ్య స‌యోధ్యతోనే ఉప‌యోగం ఉంటుంద‌న్నారు. కేసీఆర్ త‌మ భూభాగం నుండి కృష్ణా ఆయుక‌ట్లుకు నీరు వ‌చ్చేలా అంగీక‌రించి..ముందుకు వ‌చ్చినందుకు అభినందిం చాల‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు.ముఖ్య‌మంత్రి ప్ర‌సంగంపై ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు స్పందించారు. ముఖ్య‌మంత్రి అన్నీ తన‌కే తెలుస‌ని భావిస్తున్నార‌ని..ముఖ్య‌మంత్రి గారు.. నా అనుభ‌వం అంత లేదు మీ వ‌య‌సు అని వ్యాఖ్యానించారు. దీనికి వైసీపీ స‌భ్యులు అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌గా ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు జ‌గ‌న్‌..కేసీఆర్ మ‌ధ్య ఒప్పందం భావి త‌రాల‌కు న‌ష్టం జ‌రిగేలా ఉండ‌కూడ‌ద‌ని.. దీని పైన చ‌ర్చ జ‌రిపి ఆమోదం తీసుకోవాల‌ని సూచించారు.ఇప్పుడు ఈ ఒప్పందం ఇద్ద‌రు క‌లిసి ఉన్న స‌మ‌యంలో బాగానే ఉంటుంద‌ని..ఆ ఇద్ద‌రూ ప‌దవులు వీడితే త‌రువాత ఇది అమ‌లవుతుంద‌ని న‌మ్మ‌కం ఏంట‌ని ప్ర‌శ్నించారు. దీనికి కొన‌సాగింపు ప్రాతిప‌దిక ఏంట‌ని నిల‌దీశారు. ముఖ్య‌మంత్రి చేసిన స్టేట్‌మెంట్ చాలా సున్నిత‌మైద‌ని.. తొంద‌ర ప‌డ‌వ‌ద్దు..భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్ణ‌యం తీసుకోవాల‌ని సూచించారు.ముఖ్య‌మంత్రి స్పందిస్తూ..40 ఏళ్ల అనుభ‌వం అంటారు..ఇదేనా మీ ప‌రిజ్ఞానం అంటూ ప్ర‌శ్నించారు. ఇది ఇద్ద‌రి వ్య‌క్తుల మ‌ద్య ఒప్పందం కాద‌ని..రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య అగ్రిమెంట్ అని స్ప‌ష్టం చేసారు. తెలంగాణ భూ భాగం నుండి నీటిని మ‌న‌కు ఇవ్వ‌టానికి కేసీఆర్ ముంద‌కు వ‌చ్చార‌ని చెప్పుకొచ్చారు. అదే విధంగా ప్ర‌స్తుతం సాగ‌ర్ .. శ్రీశైలం ప్రాజెక్టులు రెండు ప్ర‌భుత్వాల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే ఉన్నాయ‌ని..అదే విధంగా భ‌విష్య‌త్‌లో కొన‌సాగుతుంద‌ని తేల్చి చెప్పారు. మ‌రి ఇన్ని మాట్లాడే వ్య‌క్తి రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో వీటి పైన ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌ని అడిగారు. సోనియా గాంధీని చూసి భ‌య‌ప‌డ్డారా అని ముఖ్య‌మంత్రి నిల‌దీశారు. హ‌రికృష్ణ భౌతిక ఖాయం వ‌ద్ద రాజ‌కీయ పొత్తులు పెట్టుకోవ‌టానికి మాట్లాడిన వ్య‌క్తి చంద్ర‌బాబు అని ఫైర్ అయ్యారు. కేంద్ర మా ఇద్ద‌రినీ క‌ల‌వ‌నీయ‌లేదంటూ కేసీఆర్ తో సంబంధాల గురించి చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను జ‌గ‌న్ గుర్తు చేశారు. తొలి రోజు సమావేశంలో మంత్రి అనీల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్య సభాపర్వంలో రచ్చకు కారణం అయ్యింది . ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి అందులోనూ ఒక బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉండి సభలో ఆయన వాడకూడని అసభ్య పదజాలాన్ని వాడారు. దీంతో అటు టీడీపీ ఎమ్మెల్యేలు, స్పీకర్ దాన్ని తప్పు పట్టారు.నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి . తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ నడిచింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపించే అవకాశం ఉంది. ఇవాళ ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు జులై 30 వరకు కొనసాగుతాయి. మొత్తంగా 14 రోజుల పాటు అసెంబ్లీ నడవనుంది. జులై 12వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి బడ్జెట్‌ను, మంత్రి కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. నవరత్నాల అమలే ప్రధాన ఎజెండాగా బడ్జెట్ ఉండనుంది. జులై 15, 16, 17 తేదీల్లో మూడు రోజుల పాటు బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. జులై 17వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌పై సమాధానమిస్తారు. అయితే తొలిరోజునే జలవనరుల శాఖామంత్రి అనీల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యతో సభలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అయ్యింది.సభలో పోలవరం ప్రాజెక్ట్ అంశంపై మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఎవరి హయాంలో వచ్చాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. కేంద్రం నుంచి అనుమతులను తీసుకురావడం దగ్గరి నుంచి, కాలువ పనుల వరకూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడిన అనీల్ పోలవరం ప్రాజెక్టు కోసం వైఎస్ తవ్వించిన కాలువలకే రెండు లిఫ్టులు పెట్టి టీడీపీ నేతలు రూ.400 కోట్లు దొబ్బేశారని వ్యాఖ్యానించారు.దీంతో మంత్రి అనీల్ ‘దొబ్బేయడం’ అనే పదాన్ని వాడటంపై టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. సభలో మాట్లాడే భాష ఇదేనా అంటూ మండిపడ్డారు. ఇక స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఈ ఆన్ పార్లమెంటరీ పదాన్ని వెనక్కు తీసుకోవాలని మంత్రికి సూచించారు. దీంతో చివరికి తన వ్యాఖ్యను ఆయన ఉపసంహరించుకుంటున్నట్టు మంత్రి అనిల్ తెలిపారు . పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని హక్కులు వైఎస్ కే ఉన్నాయనీ, ఈ ప్రాజెక్టును పూర్తిచేయబోయేది కూడా తామేనని స్పష్టం చేశారు. మధ్యలో టీడీపీ చేసింది ఏమీ లేదని , దోచుకు తినటం తప్ప అని మంత్రి అనీల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos