కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా

కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా

విజయవాడ, జనవరి 8: కార్పొరేటర్ పదవికి ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత రాజీనామా చేశారు. సోమవారం విజయవాడ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్ళిన శ్వేత మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తన రాజీనామా ఆమోదించాలని కోరారు. శ్వేత రాజీనామా గురించి తండ్రి కేశినేని నాని ఈ రోజు ఉదయం ఫేస్బుక్ వేదికగా తెలిపారు. శ్వేత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి… తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తారని, ఆ తర్వాత టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారని ఆయన పేర్కొన్నారు. అన్నట్టుగానే కార్పొరేటర్ పదవికి శ్వేత రాజీనామా చేశారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్సభ సభ్యత్వంతో పాటు తెలుగుదేశం పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ఇప్పటికే కేశినేని నాని ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos