విదేశీ ఆయుధాలతో తాలిబన్ల పరేడ్

విదేశీ ఆయుధాలతో తాలిబన్ల పరేడ్

కాబూల్ : తాలిబన్లు ఆయుధ ప్రదర్శన జరిపారు. ఈ కవాతులో ఎం117 సాయుధ వాహనాలు, ఎం17 హెలికాప్టర్లు, ఎం4 అస్సాల్ట్ తుపాకుల వంటి వాటిని ప్రదర్శించారు. తాలి బన్ల ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ గతంలో జాతీయ దళాల్లో పని చేసిన పైలట్లు, మెకానిక్ లను ఇప్పుడు తమ సైన్యంలో చేర్చుకుంటున్నట్టు తెలిపారు. మరోవైపు గ తంలో కేవలం సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే కనిపించిన తాలిబన్ ఫైటర్లు ఇప్పుడు మిలిటరీ దుస్తులను ధరించారు. పెద్ద ఎత్తున అమెరికా, ఇతర దేశాలు వదిలేసి వెళ్లి న అత్యంత అధునాతనమైన ఆయుధాలను సొంతం చేసుకున్నారు. తాలిబన్ల పాలన మొదలైన తర్వాత కొత్తగా 250 మంది సైనికులకు శిక్షణ ఇచ్చారు. వీరు శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా కవాతు నిర్వహించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos