విజయ్ కి తమిళుల నుంచి అసమ్మతి సెగ..

  • In Film
  • October 14, 2020
  • 142 Views
విజయ్ కి తమిళుల నుంచి అసమ్మతి సెగ..

తమిళ్ హీరో విజయ్ కి అసమ్మతి సెగ తగిలింది. తాజాగా విజయ్ శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో నటిస్తున్నాడు. దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ మంగళవారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తమిళ్ ప్రజలు విజయ్ ఫై మండిపడుతున్నారు.శ్రీలంకన్ క్రికెటర్ మీద సినిమా తీయడం నచ్చలేదని ఆ మధ్య శ్రీలంకన్లు నెలకొల్పిన విషాదమే ఇందుకు ప్రధాన కారణం అన్నట్టు తెలుస్తుంది. అందుకే సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి వల్ల పడుతున్నామని, అతని సినిమాలు బాయ్ కాట్ చెయ్యాలని హ్యాష్ ట్యాగ్స్ తో పెద్ద ట్రెండ్ చేస్తున్నారు.ప్రపంచ క్రికెట్ చరిత్రలో ముత్తయ్య మురళీధరన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తన స్పిన్ మాయాజాలంతో మహా మహా బ్యాట్స్ మెన్ ను సైతం బోల్తా కొట్టించి .. పెవిలియన్ కి పంపిన ఘనత అతనిది. బౌలర్ గా ఎన్ని రికార్డ్స్ సాధించాడు. అలాంటి గొప్ప క్రికెటర్ జీవిత కథను సినిమా రూపంలో తెరకెక్కించబోతున్నారు.ఈ చిత్రానికి ‘800’ అనే టైటిల్ని నిర్ణయించినట్టు సమాచారం. మురళీధరన్ అంతర్జాతీయ క్రికెట్లో 800 వికెట్లు తీసిన వైనానికి సంకేతంగా దీనికి ఆ టైటిల్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దార్ మోషన్ పిక్చర్స్ తో కలసి సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించే ఈ చిత్రానికి ఎమ్మెస్ శ్రీపతి దర్శకత్వం వహించబోతున్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos