మరో తమిళ హీరో పొలిటికల్ ఎంట్రీ?

మరో తమిళ హీరో పొలిటికల్ ఎంట్రీ?

తమిళనాట తారలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తున్నారు. కానీ జనాలే వారిని నమ్మడం లేదు. ఓట్లు వేసే పరిస్థితులు కనిపించడం లేదు.తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడా?.. తమిళనాడు రాజకీయాలతోపాటు, కోలీవుడ్‌లోనూ ఇప్పుడు ఇది ఎడతెగని చర్చగా మారింది.ఇప్పటికే అగ్రహీరో కమల్ హాసన్ పార్టీ పెట్టి మొన్నటి సార్వత్రిక ఎన్నికల వేళ పరీక్షించుకున్నాడు. ఎన్నికల్లో ఒక్కసీటు దక్కక అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. దీంతో తిరిగి సినిమాలు చేసుకుంటూ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నాడు.ఇక మరో సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడో రాడో కూడా తెలియని పరిస్థితి. ఓసారి వస్తానంటాడు.. మరో సారి తటపటాయిస్తాడు.. ఆయన కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయినా అవేవీ పట్టించుకోకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.ఇప్పుడు తాజాగా తమిళ హీరోల్లో ప్రజల్లో ఫుల్ క్రేజ్ ఉన్న విజయ్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీచేస్తుందని.. విజయ్ కూడా పోటీచేస్తారని అంటున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీ చేయబోతున్నాడంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియా అయితే ఈ వార్తలతో హోరెత్తిపోతోంది.
ఏ పార్టీ తరపునో కాకుండా సొంత పార్టీ నెలకొల్పి పోటీ చేయబోతున్నాడన్న వార్తలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ ఇప్పటికే రంగంలోకి దిగారని, కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద తమ పార్టీ పేరును నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. అంతేకాదు, ఇందుకోసం ఢిల్లీకి చెందిన ప్రముఖ న్యాయవాదితో టచ్‌లో ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయంలో విజయ్ నుంచి కానీ, ఆయన తండ్రి నుంచి కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు.ఇలా కమల్ రజినీకాంత్ లతోనే కాని పనిని తాజాగా హీరో విజయ్ తలకెత్తుకున్నట్టు తెలుస్తోంది. మరి తమిళ రాజకీయాల్లో విజయ్ పోటీనిస్తాడా? ఊసురుమంటాడా అన్నది వేచిచూడాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos