తమన్నాపై విజయ్‌ అభిమానులు గరం..

  • In Film
  • October 12, 2019
  • 129 Views
తమన్నాపై విజయ్‌ అభిమానులు గరం..

భారతీయ చిత్ర పరిశ్రమల్లో తమిళ చిత్ర పరిశ్రమ అన్నింట్లోనూ ప్రత్యేకమే.ప్రయోగాత్మక చిత్రాలు,విభిన్న కథలే కాదు ఏదైనా ప్రకృతి వైపరిత్యాలు సంభవించినపుడు హీరోలు స్పందించే తీరు,సినిమాలు విడుదలైనపుడు అభిమానుల సందడి ఇలా ప్రతీది ప్రత్యేకమే.ఇక రజనీకాంత్,కమల్హాసన్ అనంతరం తమిళంలో విజయ్,అజిత్లకు మాత్రమే అంతటి అభిమాన గణం ఉంది. వీరిద్దరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడ్డాయంటే అభిమానుల మధ్య గొడవలు జరగాల్సిందే.తమ అభిమాన హీరోల గురించి ఏదైనా తేడాగా మాట్లాడితే ఎదుటోళ్లకు చుక్కలు చూపిస్తుంటారు.తాజాగా తమన్నాకు కూడా అదే పరిస్థితి ఎదురైంది.తమన్నా నటించిన పెట్రోమ్యాక్స్.. సినిమా విడుదల సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ గురించి ప్రశ్న ఎదురైంది.అందుకు తమన్నా సుర సినిమాలో విజయ్‌తో కలిసి నటించాను. అయితే ఆ సమయంలో ఆయనతో మాట్లాడింది చాలా తక్కువ. వచ్చామా పాటలో డ్యాన్స్ చేశామా.. వెళ్లామా అన్నట్లు ఉండేది.. ఆ సినిమాలో నా పాత్ర కూడా చాలా చిన్నది.. ఆయన గురించి తెలీకుండా నేను కామెంట్ చేయలేను.. నేనూ ఓ అభిమానిలానే ఆ సినిమాలో నటించా అంటూ బదులిచ్చింది.అంతే విజయ్ గురించి తెలియదంటూ వ్యాఖ్యలు చేసినందుకు విజయ్ అభిమానులు తమన్నాపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos