ప్రజలందరికీ క్షమాభిక్ష

ప్రజలందరికీ క్షమాభిక్ష

కాబూల్ : తాలిబన్ ప్రభుత్వం దేశ ప్రజలందరికీ మంగళవారం క్షమాభిక్ష ప్రకటించింది. ”దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రకటించాం. మీ కార్యక్రమాలను పూర్తి భరోసాతో, విశ్వాసంతో తిరిగి ప్రారంభించండి” అని ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ ప్రకటన వచ్చిన కొన్ని నిమిషాల్లోనే కాబూల్ విమానాశ్రయంలో ఒక పౌరుడిపై కాల్పులు జరిపిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సంచలనమైంది. అన్ని సరిహద్దులను మూసివేయడంతో దేశం నుండి పారిపోయేందుకు వేలాది మంది ప్రజలు కాబూల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలోకి ప్రవేశిస్తున్న ఒక పౌరుడిపై తాలిబన్ సైనికుడు కాల్పులు జరిపిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా ఈ వీడియోను పోస్ట్ చేసింది. విమానాశ్రయంలోకి వెళ్లేందుకు యత్నిస్తున్న ఒక పౌరుడిపై అక్కడి సైన్యం కాల్పులు జరిపింది. వాస్తవానికి ఆ పౌరుడు తాలిబన్లు గతంలోని ఆఫ్ఘన్ సైనికుల మాదిరిగా ప్రవర్తిస్తారని భావించాడు. కానీ తాలిబన్లు కాల్పుల రూపంలో అతనికి సమాధానమిచ్చారని ఆ వీడియోకు ట్యాగ్ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos