సిఎం ఇంటి వద్ద స్పృహ కోల్పోయిన మహిళ

సిఎం ఇంటి వద్ద  స్పృహ కోల్పోయిన మహిళ

అమరావతి : తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ నివాసం ఎదుట సోమ వారం సంభవించిన తొక్కిసలాటలో అనంతపురం జిల్లా కణేకల్లు మండలానికి చెందిన విశ్రాంతమ్మ అనే మహిళ ఊపిరాడక స్పృహ కోల్పోయారు. ఆమెను పోలీసులు అంబులెన్సులో హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రస్తుతానికి ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. ప్రజా దర్బార్ వాయిదా పడిన విషయం తెలియక సోమవారం ఉదయం వేలాదిగా ప్రజలు తమ సమస్యల్ని విన్నవించుకునేందుకు ముఖ్యమంత్రి నివాసం వద్ద గుమి కూడారు.ఒక్కసారిగా తొక్కిసలాట సంభవించింది. ముఖ్యమంత్రిని కలుసుకునేందుకు రెండు వాహనాల్లో వచ్చిన ప్రజలను పోలీసులు ఆవరణలోకి అనుమతించారు. ఈ సందర్భంగానే తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos