ఇన్సులిన్‌ బదులుగా మాత్రలు

ఇన్సులిన్‌ బదులుగా మాత్రలు

ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌కు ప్రత్యామ్నాయంగా సరికొత్త మాత్రలను ఎంఐటీ, నోవో నోర్‌డిస్క్‌ పరిశోధకులు ఉత్పత్తి చేశారు. తద్వారా ఇంజెక్షన్‌ నొప్పి నుంచి త్వరలోనే ఉపశమనం కలగనుంది. సాధారణంగా జీర్ణ వ్యవస్థలో ఇన్సులిన్‌, కేన్సర్‌ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే ప్రతిరోధకాలు త్వరగా కరిగిపోయి.. ప్రభావాన్ని కోల్పోతాయి. ఇన్సులిన్‌ ప్రభావాన్ని కోల్పోని విధంగా సరికొత్త ట్యాబ్లెట్‌ను వీరు రూపొందించారు. తాబేలును పోలి ఉండే ఈ ట్యాబ్లెట్‌.. పేగుల గుండా వెళ్తూ శరీరంలో ఇన్సులిన్‌ను ప్రవేశపెట్టి.. వ్యర్థాల ద్వారా బయటకు వచ్చేస్తుందని పరిశోధకులు చెప్పారు. జంతువులపై జరిపిన పరిశోధనల్లో సానుకూల ఫలితాలు వచ్చాయని తెలిపారు.  

తాజా సమాచారం

Latest Posts

Featured Videos