తబ్లిగి పై సీబీఐ దర్యాప్తు వద్దు

తబ్లిగి పై సీబీఐ దర్యాప్తు వద్దు

న్యూ ఢిల్లీ: ఇక్కడ జరిగిన తబ్లిగి జమాత్ సదస్సు గురించి సీబీఐ దర్యాప్తు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం శుక్ర వారం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. ‘ఈ అంశంపై చట్ట ప్రకారం రోజువారీ దర్యాప్తు జరుపుతున్నాం. నిర్దిష్ట కాలవ్యవధిలో నివేదికనూ సమర్పిస్తామ’ని ప్రమాణ పత్రంలో వివరించింది. ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల తప్పిదాల కారణంగానే తబ్లిగీ జమాత్ సదస్సు జరిగినందున సీబీఐ చే దర్యాప్తు జరిపించాలని సుప్రియ పండిత అనే వ్యక్తి వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. అక్రమ నగదు లావాదేవీలకు జమాతే ట్రస్టు పాల్పడినట్లు అందిన ఫిర్యాదు మేరకు తబ్లిగి జమాత్, మరి కొందరు గుర్తుతెలియని వ్యక్తులపై సీబీఐ గత వారంలో ప్రాథమిక విచారణ కూడా జరిపింది. సదస్సుకు హాజరైన పలువురు విదేశీయులపై ఢిల్లీ పోలీసులు పలు అభియోగ పత్రాల్ని దాఖలు చేసారు. తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్పై పలు ఐపీసీ సెక్షన్ల కింద, విపత్తు నిర్వహణా చట్టం కిందా ప్రాథమిక సమాచార నివేదికల్ని దాఖలు చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos