తెలంగాణ మంత్రుల శాఖలివే..

హైదరాబాద్ : తెలంగాణ మంత్రులకు శాఖలు కేటాయించడం జరిగింది. భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ కేటాయించారు. తెలంగాణ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఉదయం రాజ్భవన్లో అక్బురుద్దీన్తో గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇక మంత్రులకు శాఖలు కేటాయించడం జరిగింది.
భట్టి విక్రమార్క – ఆర్థిక శాఖ
దామోదర రాజనర్సింహ – ఆరోగ్య శాఖ
శ్రీధర్ బాబు – ఐటి, శాసనసభ వ్యవహారాలు
సీతక్క – పంచాయితీ రాజ్
తుమ్మల – వ్యవసాయ
జూపల్లి – ఎక్సైజ్
ఉత్తమ్ కుమార్ రెడ్డి – సివిల్ సప్లయ్, భారీ నీటి పారుదల
కోమటి రెడ్డి వెంకటరెడ్డి – ఆర్అండ్బీ
పొన్నం ప్రభాకర్ – రవాణా శాఖ
పొంగులేటి శ్రీనివాసరెడ్డి – సమాచార శాఖ
కొండా సురేఖ – అటవీ శాఖ

తాజా సమాచారం

Latest Posts

Featured Videos