మహిళలకు వడ్డీలేని రుణాలు

మహిళలకు వడ్డీలేని రుణాలు

హైదరాబాదు: త్వరలో మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన నల్గొండ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. మహిళా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. త్వరలో వడ్డీ లేని రుణాలు అందిస్తా మన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos