సైరా థియేటర్లపై జీఎస్టీ టాస్క్‌ఫోర్స్‌ దాడులు!

  • In Film
  • October 18, 2019
  • 125 Views
సైరా థియేటర్లపై జీఎస్టీ టాస్క్‌ఫోర్స్‌ దాడులు!

అత్యంత భారీ వ్యయంతో ఈనెల 2వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సైరా నరసింహారెడ్డి చిత్రం ఇతర భాషల్లో ఫ్లాప్ అయినా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నిలకడైన వసూళ్లు సాధిస్తూ బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది.ఈ నేపథ్యంలో ‘సైరా’ ప్రదర్శిమవుతున్న థియేటర్లపై జీఎస్టీ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు నిర్వహించడం హాట్ టాపిక్గా మారింది. జీఎస్టీ విషయంలో చాలా పక్కాగా ఉంటున్న కేంద్ర ప్రభుత్వం సైరా థియేటర్స్పై కన్నేసింది. ఈ మేరకు లెక్కలు తేల్చడానికి టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సైరా థియేటర్లలో సోదాలు నిర్వహించారు.తూర్పుగోదావరి జిల్లాలోని పలు థియేటర్లలో అధికారుల సోదాలు జరిగాయని తెలిసింది.రామ్ చరణ్ సైరా బయ్యర్ల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం కలెక్షన్లు బ్రేక్ ఈవెన్ దాటేంత వరకు నిర్మాత రామ్ చరణ్ జీఎస్టీని చెల్లించాల్సి ఉందట. సినిమా లాభాల బాట పట్టాక ఇప్పుడు బయ్యర్లు జీఎస్టీ చెల్లించాలి. ప్రస్తుతానికి నైజాం, ఉత్తరాంధ్రలో సైరా బ్రేక్ ఈవెన్ దాటేసింది. మిగిలిన చోట్ల దగ్గరలో ఉంది.ఒక్క తూర్పుగోదావరి జిల్లా లోనే ఈ దాడులు జరిగాయా? లేదా ఇంకా మరిన్ని చోట్ల జరిగాయా? అనే విషయం తెలియాల్సి ఉంది.అయితే దాడులపై అటు నిర్మాతలు కానీ ఇటు అధికారులు కానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos