న్యూజీలాండ్ కాగ్ పాండ్య

న్యూజీలాండ్ కాగ్ పాండ్య

ముంబయి: సస్పెన్షన్‌ ఎత్తివేయడంతో టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య న్యూజిలాండ్‌ బయల్దేరాడు. జట్టుతో కలవనున్నాడు. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న కేఎల్‌ రాహుల్‌ భారత్‌-ఏ తరఫున ఆడనున్నాడు. ఇంగ్లాండ్‌ లయన్స్‌తో ఈ జట్టు ఐదు వన్డేలు ఆడనుంది. కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాండ్య మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతడితో పాటు రాహుల్‌ సైతం షోకు హాజరవ్వడంతో ఇద్దరిపై వేటు వేశారు. కాగా వీరిపై ప్రస్తుతం సస్పెన్సన్‌ ఎత్తివేయడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే వారు తగిన శిక్ష అనుభవించారని కొందరు అనగా మరికొందరేమో వారి సేవలు జట్టుకు అవసరం లేదంటున్నారు. ప్రస్తుతం జట్టు కూర్పు బాగుందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. అసలు ఈ వ్యవహారంలోకి సుప్రీంను ఎందుకు తీసుకొచ్చారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. పాండ్య, రాహుల్‌పై ఎందుకు ఉన్నపళంగా వేటు వేశారు? ఎందుకు విచారణ లేకుండానే ఎత్తివేశారని బీసీసీఐని విమర్శిస్తున్నారు. బీసీసీఐ కేసులో సుప్రీం కోర్టు నియమించిన కొత్త అమికస్ ‌క్యూరీ పీఎస్‌ నరసింహను సంప్రదించిన తర్వాత పాలకుల కమిటీ పాండ్య, రాహుల్‌పై గురువారం సస్పెన్షన్‌ ఎత్తివేసింది. ఫాస్ట్‌బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌పాండ్య లేకపోవడంతో జట్టు కూర్పు కుదరడం లేదని, సమతూకం కష్టమవుతోందని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ ఇంతకు ముందే చెప్పిన సంగతి తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos