మధ్యవేలు చూపించిన నిహారిక..

  • In Film
  • March 27, 2019
  • 142 Views
మధ్యవేలు చూపించిన నిహారిక..

మెగా డాటర్‌ నిహారిక నటించిన కొత్త చిత్రం సూర్యకాంతం శుక్రవారం విడుదల కానునన్న నేపథ్యంలో విడుదల చేసిన సూర్యకాంతం ట్రైలర్‌ చిత్రంపై అంచనాలు పెంచింది.ఇప్పటి వరకు నిహారిక నటించిన చిత్రాల కంటే ఈ చిత్రం భిన్నంగా ఉన్నట్లు ట్రైలర్‌లో స్పష్టమవుతోంది.ఇప్పటి వరకు నటించిన చిత్రాల్లో పద్ధతిగా కనిపించే పాత్రల్లో నటించిన నిహారిక సూర్యకాంతం చిత్రంలో రెబల్‌గా కనిపించనున్నట్లు ట్రైలర్‌లో తెలుస్తోంది.సూర్యకాంతం చిత్ర కథ విషయానికి వస్తే ఈ చిత్రం త్రికోణ ప్రేమకథగా తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది.సూర్యకాంతం,అభి,పూజల మధ్య త్రికోణ ప్రేమకథతో ఇప్పటికి ట్రెండ్‌కు తగ్గట్లుగా చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.టైటిల్‌కు తగ్గట్లే నిహారిక ఈ చిత్రంలో గయ్యాళి అమ్మాయిగా కనిపించనుంది.పాత్రకు తగిన విధంగా నిహారిక బాడీ లాంగ్వేజ్ ఉండటంతో ట్రైలర్ మెప్పిస్తోంది. ట్రైలర్ చివర్లో నిహారిక మిడిల్ ఫింగర్ చూపిస్తూ సీరియస్ లుక్ ఇవ్వడం హైలెట్. ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించిన రాహుల్ విజయ్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఇద్దరు అమ్మాయిల్లో ఎవరిని ఎంచుకోవాలో తెలియని అయోమయమైన పాత్రలో అతడి నటన మెప్పించే విధంగా ఉంటుందని ట్రైలర్‌తో తేలిపోయింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos