వివాదంలో బీజేపీ ఎంపీ

వివాదంలో బీజేపీ ఎంపీ

బెంగళూరు : భాజపా లోక్సభ సభ్యుడు తేజస్వి సూర్య గతంలో చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదమైంది. 2015లో అరబ్ మహిళల శృంగార జీవితాన్ని ఎగతాళి చేసిన దానిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. అరబ్ దేశాల పలువురు ప్రముఖులు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఒక ప్రజా నాయకుడు స్త్రీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు. తేజస్వీ మొత్తం దేశ ప్రజల అవమానపడేలా చేశారని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.. తేజస్వీ సూర్య లాంటి చేసే చెత్త వ్యాఖ్యాలపై భాజపా నాయకత్వం చర్యల్ని తీసుకోదని కాంగ్రెస్ నేత శ్రీవత్స ఆరోపించారు. దీని వెనుక ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ప్రోత్సహం ఉందని మండిపడ్డారు. ట్వీట్పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆయన ఆ ట్వీట్ను తొలగించారు. తేజస్వీ ట్వీట్ తొలగించిన తర్వాత కూడా ఆ వివాదం ఆగలేదు. తేజస్వీ చర్యను పిరికి పంద చర్యగా పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos