కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు..

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు..

మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. మహారాష్ట్రలో బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే అవకాశం లేకుండా రోజే బలపరీక్షకు అవకాశం ఇవ్వాలని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. మహారాష్ట్ర గవర్నర్ కోష్యారీ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌కు ఇచ్చిన మద్దతు లేఖలను తమకు రేపు ఉదయం 10.30లోగా సమర్పించాలని కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతుపై వివరాలు తెలపాలని కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సీఎం ఫడ్నవిస్, ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్‌లకు నోటీసులు జారీ చేసింది. తమకు రేపు సొలిసిటర్ జనరల్ లేఖలు సమర్పించిన తర్వాత బలపరీక్ష పిటిషన్ పై నిర్ణయం తీసుకుని ప్రకటిస్తామని తెలిపింది. పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది. ఫడ్నవీస్ ప్రభుత్వం 24 గంటల్లోగా తమ మెజార్టీ నిరూపించుకొనేలా ఆదేశాలివ్వాలని కూటమి న్యాయవాదులు సుప్రీంను కోరారు. అయితే, సుప్రీం వెంటనే బల నిరూపణ చేయాల్సిన అవసం లేదని వ్యాఖ్యానించింది. సోమవారం ఉదయం 10.30 గంటల కల్లా మద్దతిచ్చే వారి వివరాలతో లేఖ ఇవ్వాలని ఆదేశించింది. బల పరీక్ష అంశం పైన సోమవారం చేపట్టే తదుపరి విచారణలో సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos