ఆమె నటనకు దర్శకుడి గుండె ఆగింది

  • In Film
  • June 28, 2019
  • 115 Views
ఆమె నటనకు దర్శకుడి గుండె ఆగింది

ముంబై : ఆమెను తుపాకీతో కాల్చే సన్నివేశం. హీరో ఆమెను కాల్చేశాడు. కింద పడిపోయింది. దర్శకుడు షాట్‌ ఓకే అన్నాడు. అమేమో పైకి లేవలేదు. అంతే దర్శకుడికి గుండె ఆగినంత పనైంది. ఆమె ఎవరో కాదు యువతను ఉర్రూతలూగిస్తున్న సన్నీలియోన్‌. ఆమె ఓ సినిమాలో నటిస్తున్నారు. చిత్రీకరణలో భాగంగా ఆమెను తుపాకీతో కాల్చే సన్నివేశాన్ని గురువారం రాత్రి చీత్రీకరించారు. హీరో తుపాకీతో కాల్చగానే కింద పడిపోయింది. దర్శకుడు షాట్‌ ఓకే అన్నాడు. సన్నీ ఏమో లేవలేదు. దీంతో సెట్‌లోని వారంతా గజ గజ వణికిపోయారు. ఆమెను లేపడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా కళ్లు తెరిచి నవ్వడం మొదలెట్టింది. దీంతో సెట్‌లోని వారంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. సన్నీ దీనికి సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos