పేజ్‌లో ఎంతసేపు గడుపుతారో నాకు తెలుసు..

  • In Film
  • April 24, 2019
  • 145 Views
పేజ్‌లో ఎంతసేపు గడుపుతారో నాకు తెలుసు..

ఒకప్పుడు పోర్న్‌ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకున్న సన్నీ లియోన్‌ చాలా ఏళ్ల క్రితమే పోర్న్‌ ఇండస్ట్రీని వదిలేసి భారతీయ చిత్ర పరిశ్రమల్లో నటిగా కొనసాగుతున్నా గతాన్ని మాత్రం సామాజిక మాధ్యమాలు సన్నీకి గుర్తు చేస్తూనే ఉన్నాయి.తాజాగా పోర్న్‌ ఇండస్ట్రీలోకి ప్రవేశించడం అటుపై బాలీవుడ్‌ ద్వారా భారతీయ సినీ పరిశ్రమలోకి ప్రవేశించడంపై ఒక షోలో సన్నీ లియోన్‌ స్పందించారు. అందులో తన గంతపై కొంతమంది చేసిన కమెంట్లుకు స్పందించిన సన్నీ ‘‘మీరు నా పేజ్‌లో ఎంతసేపు గడుపుతారో నాకు తెలుసు’’అంటూ బదులిచ్చారు.పోర్న్ స్టార్ గా కెరీర్ ఆరంభించిన సన్నీలియోన్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ గా బిజీ అయ్యారు. సన్నీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో..అంతే సంఖ్యలో ట్రోల్స్ చేసేవారు కూడా ఉన్నారు. కొందరైతే అసభ్యపదజాలంతో ఆమెని దూషిస్తూ కామెంట్స్ చేస్తుంటారు.వీటన్నింటిని తలచుకొని సన్నీ లియోన్‌ అప్పుడప్పుడూ సంతోషం,బాధ రెండింటిని వ్యక్తం చేస్తుంటారు కూడా.అలానే తనను ముంబైలో ఎంతగానో భయపెట్టిన ఒక వ్యక్తి గురించి చెప్పుకొచ్చారు. అతడు అసభ్యంగా ఈమెయిల్స్ పంపేవాడని, కామెంట్స్ పెట్టేవాడని.. తనను తిట్టడమే కాకుండా ఫ్యామిలీని కూడా దూషించేవాడని.. ఇంటికొస్తానని బెదిరించేవాడని చెప్పుకొచ్చారు. చాలా ఎమోషనల్ గా.. వైలెంట్ గా సందేశాలు పంపించేవాడని.. తనను ఎంతో భయపెట్టినట్లు తెలిపారు.ఇంట్లో ఒంటరిగా ఉంటే ఒక చేతిలో కత్తి పట్టుకొని డోర్ తీయడానికి వెళ్లేదాన్ని అంటూ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వివరించింది. మొత్తానికి అతడి అకౌంట్ ని డిలీట్ చేయించగలిగానని, ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు అతడిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos