రోజుకు రూ.25లక్షల ఇస్తే వస్తా..

  • In Film
  • June 14, 2019
  • 128 Views
రోజుకు రూ.25లక్షల ఇస్తే వస్తా..

రియాలిటీ షోలలో బిగ్‌బాస్‌ షోకు ఉన్న క్రేజే వేరు.విదేశాల్లో చాలా పాపులరైన బిగ్‌బాస్‌ షో దశాబ్ద కాలం క్రితమే ఇండియాలోకి అడుగుపెట్టినా కేవలం హిందీ వరకు మాత్రమే పరిమితమైంది.అటుపై బెంగాళీ ప్రారంభమైన బిగ్‌బాస్‌ మెల్లిగా దక్షిణాదివైపు అడుగులేసింది.మొదటగా కన్నడలో ప్రవేశించిన బిగ్‌బాస్‌ ఆరు సీజన్‌లు పూర్తి చేసుకుంది.చివరగా తెలుగు,తమిళంలోకి ఒకేసారి అడుగుపెట్టిన బిగ్‌బాస్‌ రెండు సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ షో మూడో సీజన్ కి రెడీ అవుతోంది.తెలుగు సీజన్‌కు సంబంధించి కంటెస్టంట్లుగా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో ఫైనల్ లిస్ట్ రాబోతున్న తరుణంలో స్టార్ మా యాజమాన్యం ఈ షో కోసం పాపులర్ సెలబ్రిటీలను తీసుకురావాలని చూస్తోంది. అందుకోసం కమెడియన్ టర్న్డ్ హీరో సునీల్ ని సంప్రదించారని పాల్గొనడానికి అంగీకరిస్తూనే  రోజుకి రూ.25 లక్షల చొప్పున రెమ్యునరేషన్ ఇవ్వాలని అడిగారట.దీంతో ఖంగుతిన్న షో నిర్వాహకులు అక్కడ నుండి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు బిగ్ బాస్ నిర్వాహకులు క్రేజ్ ఉన్న సెలబ్రిటీలకు రోజుకి లక్ష, మహా అయితే రెండు లక్షలు మాత్రమే చెల్లించారు. అలాంటిది సునీల్ రోజుకి పాతిక లక్షలు అడగడంతో షాక్ అయ్యారు. సినిమాలో నటించడానికి రోజుకి సునీల్ కి ఐదు నుండి పది లక్షలు చెల్లిస్తారు.అలాంటిది ఆయన టీవీ షో కోసం అంత మొత్తాన్ని అడగడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos