మార్చి 1 నుంచి వేసవి

మార్చి 1 నుంచి వేసవి

హైదరాబాద్ ; చలి ప్రభావం తగ్గిపోతోంది. ఎండ ప్రభావం ఇప్పటికే మొదలైందని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి 1 నుంచి వేసవి ఆరంభమవుతుందని తెలిపింది. గురువారం హైదరాబాద్ లో 19.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠం, 32.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో 15-21 డిగ్రీల మధ్య కనిష్ఠం, 31-32 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవి క్రమంగా పెరగనున్నాయి. ప్రస్తుతం దక్షిణం నుంచి గాలులు తెలంగాణ వైపు వీస్తుండడంతో పొడి వాతావరణం నెలకొంది.. ఎండ తీవ్రత 40 డిగ్రీల స్థాయిలో ఉండనుందని వాతావరణ కేంద్రం ఇంచార్జ్ డైరెక్టర్ నాగరత్న వివరించారు. నిరుడు ఎండ తీవ్రత కొంత తక్కువగా ఉంది. ఈ ఏడాది కూడా అదే వాతావరణం ఉండొచ్చని వాతావరణ అంచనా.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos