వడగాడ్పులతో జనం విలవిల

వడగాడ్పులతో జనం విలవిల

అమరావతి: రాష్ట్రంలో నానాటికీ వేడి పెరిగి పోతోంది. వాయువ్య దిశ నుంచి మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ మీదుగా వీస్తున్న వేడి గాలుల వల్ల ఉష్ణో గ్రతలు పెరిగి పోతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు దాకలవుతున్నాయి. మరో రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. సగటున 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశలున్నాయని అంచనా వేసింది. మరో వైపు వడగాడ్పుల తీవ్రత ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఉదయం నుంచే వేడి గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకు తున్నారు. ద్విచక్ర వాహన దారులూ ఇబ్బంది ఎదుర్కొంటు న్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో చాలా చోట్ల కర్నూలు, పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో తీర ప్రాంతం, రాయలసీమ జిల్లాల్లోనూ చాలా చోట్ల 45 డిగ్రీలకు పైగానే ఎండలు కాయనున్నాయి. ఉత్తర కోస్తాంధ్రలోని కొన్ని చోట్ల మాత్రం సగటు ఉష్ణోగ్రతలు 30 నుంచి 34 డిగ్రీల మధ్య ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos