మోదీది విశాల హృదయం

మోదీది విశాల హృదయం

ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో ఎన్సీపీ, భాజపా కలిసి పని చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదనను ఎన్సీపీ నేత శరద్ పవర్ సున్నితంగా తిరస్కరించారని శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే మంగళవారం ఇక్కడ ఒక మాధ్య మ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘అది ఇద్దరు సీనియర్ నేతల మధ్య జరిగిన సమావేశం. అక్కడ నేను లేను. దాని గురించి మాట్లాడలేను. నిజంగానే మోదీ అలాంటి ప్రతిపాదన చేసుంటే, అది ఆయన ఉదార మనస్తత్వం అను కోవా లి. మహారాష్ట్ర రాజకీయాల్లో వ్యక్తిగత అను బంధాలు చాలా ముఖ్యమైనవి. పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉంటా య’ని చెప్పారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాకముందు ప్రధాని మోదీతో పవార్ సమావేశమయ్యారు. ఈ సమావే శంలో తమతో కలిసి వస్తే సుప్రియా సూలేకు కేంద్ర మంత్రి వర్గంలో స్థానాన్ని కల్పిస్తా మని, శరద్ పవార్ను రాష్ట్రపతిగా నియ మిస్తామనీ భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos