కులవివక్షకు యువతి బలి

కులవివక్షకు యువతి బలి

కడప: ప్రేమించి పెళ్లి చేసుకున్న హారతి భర్త, అత్త మామల కట్నకానుకల వేధింపులు, కుల దూషణను భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. నెల్లూరు జిల్లా వెంకటరెడ్డిపాలెంకు చెందిన డమాయి హారతి బీటెక్ పట్టభద్రురాలు. ఉద్యోగాన్వేషణలో హైదరాబాద్ చేరారు. అక్కడ కడప జిల్లాకు చెందిన రామరాజుతో ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇది రామరాజు కుటుంబ సభ్యులకు నచ్చలేదు.అనివార్య కారణాల వల్ల రామరాజు భార్యతో సహా కడపకు వచ్చేశాడు. తల్లిదండ్రుల మాటవిని రామారాజు తనను ప్రతి నిత్యం వేధించేవాడని హారతి ఆత్మహ్యత పత్రంలో స్పస్టీకరించింది. అత్త,మామలూ భౌతిక దాడులకు పాల్పడేవారని ఆరోపించింది. బాధలు పడలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపింది. పోలీసులు సెక్షన్ 304, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నేరం కింద కేసు నమోదు చేసారు. శవ పరీక్ష తర్వాత హారతి మృత దేహాన్ని ఆమె తల్లిదండ్రులు తమ స్వగ్రామానికి తీసు కెళ్లారు. హారతి ఆత్మహత్యకు కారణమైన భర్త రామరాజు, అత్త, మామలపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos