రిమాండ్‌కు ఝూన్సీ ప్రియుడు

రిమాండ్‌కు ఝూన్సీ ప్రియుడు

హైదరాబాద్‌ : బుల్లి తెర నటి ఝాన్సీ ఆత్మహత్యకు సంబంధించి ఆమె ప్రియుడు సూర్యతేజను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆమె ఆత్మహత్యకు సూర్యనే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా  ఝాన్సీ మొబైల్‌ను పరిశీలించారు. వారి మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లుగా గుర్తించారు. ఇటీవల సూర్యతేజ ఆమెను దూరం పెట్టాడు. దీంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. తరచూ అనుమానిస్తూ వేధింపులకు గురిచేస్తుండటం వల్లే ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లి అన్నపూర్ణ పోలీసులకు చెప్పింది. నిందితుడిని 14రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos