ఆర్థికంగా గట్టిగా ఉన్నాం

ఆర్థికంగా గట్టిగా ఉన్నాం

న్యూ ఢిల్లీ: భారత్ ఆర్థికంగా సురక్షితంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ప్రపంచ జీడీపీ 3.2 శాతం నుంచి పతనమవుతోంది. 2014 నుంచి చేపట్టిన సంస్కరణలవల్ల భారత్ ఆర్థికంగా సురక్షిత స్థితిలో ఉంద’ని విపులీ కరించారు. ‘ఆర్థిక అవకతవకలకు అధిక జరిమానాల రూపంలో శిక్ష ఉంటుంది. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను ప్రాసిక్యూట్ చేయాలనేది మా లక్ష్యం కాదు. ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయాలన్నదే ఆశయం. సీఎస్ఆర్ ఉల్లంఘనలను క్రిమినల్ నేరాల కింద పరిగణించ బోము. ‘అక్టోబర్ 1 నుంచి కేంద్రీ కృత విధానంలో ఆదాయ పన్ను తాఖీదులు ఇస్తాం. తాఖీదులు అందిన మూడు నెలల్లోనే అన్ని కేసులు పరిష్కారమ వుతాయి. డీఎన్ఐ  లేని నోటీసులకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేద’ని చెప్పారు. ‘రెపో రేట్లకు అనుగుణంగానే గృహ, వాహన రుణాలపై వడ్డి భారం తగ్గనుందన్నారు. మార్కెట్కు రూ.5 లక్షల కోట్ల ద్రవ్య లభ్యతకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. దేశీయ, విదేశీ ప్రత్యక్ష ఈక్విటీ పెట్టు బడులపై బడ్జెట్కు ముందున్న విధానాన్ని పునరుద్ధరిస్తామన్నారు. బ్యాంకులకు రూ.70వేల కోట్లు ఆర్థిక సర్దుబాటు చేస్తాం. వడ్డీ రేట్ల తగ్గింపు లబ్ధిని ఖాతా దారులు పొందేలా చూస్తామ’ని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos