అది ఫాసిస్ట్ మెరుపు దాడి

అది ఫాసిస్ట్ మెరుపు దాడి

కోల్కత్తా : దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాలయంలో ఆదివారం ముష్కుర మూకలు జరిపిన దాడిని పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఫాసిస్ట్ సర్జికల్ స్ట్రైక్ గా అభివర్ణించారు. దాడికి వ్యతిరేకంగా విద్యార్థులు నిర్వ హి స్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించారు. విద్యార్థులంతా ఐకమత్యంగా ఉండి భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభు త్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని చేయాలని పిలుపు నిచ్చారు. వర్సిటీ విద్యార్థులపై ప్రణాళికాబద్ధంగా దాడి జరిగిందని అభిప్రా య పడ్డారు. ‘విద్యార్థులతో పాటు అధ్యాపకులపై సైతం దాడికి పాల్పడ్డారు. ఇది నాకు మాత్రమే కాదు అందరికీ బాధాకరం. వ ర్సి టీలోకి భాజపా కుట్రపూరితంగా గుండాలను పంపుతోంది. దీనిలో పోలీసులు ప్రమేయం కూడా ఉంద’ని తీవ్ర స్థాయిలో మం డి పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos