సమ్మె వద్దని వైద్యులకు వినతి

సమ్మె వద్దని వైద్యులకు వినతి

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా నిరసనలు, సంకేత ప్రాయ సమ్మెకు దిగుతున్న వైద్యులు తమ ఆందోళనను విరమించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్దన్ విజ్ఞప్తి చేశారు. వైద్యుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. కేవలం లాంఛన ప్రాయంగా నిరసించినా విధులను మాత్రం కొనసాగించాలని కోరారు. కోల్కతాలోని ఎన్ఆర్ఎస్ ఆసుపత్రిలో ఒక రోగి కుటుంబ సభ్యులు ఇద్దరు వైద్యులపై ఇటీవల దాడి చేసినందుకు పశ్చిమ బంగ వైద్యులు ఆందోళనకు దిగారు. వారికి వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వ వైద్యులు సంఘీభావాన్ని ప్రకటించారు. దీన్న ప్రతిష్టగా తీసుకోరాదని పశ్చిమ బంగ ముఖ్య మంత్రి మమతా బెనర్జీకి హర్షవర్ధన్ విజ్ఞప్తి చేశారు. డాక్టర్లకు ముఖ్యమంత్రి తుది హెచ్చరిక జారీ చేయటంతో వైద్యులు ఆగ్రహంతో సమ్మెకు దిగారన్నారు. దీని గురించి తాను మమతాబెనర్జీకి లేఖ రాసి, ఫోనులో కూడా మాట్లాడతానని తెలిపారు. దీనికి ముందు, పశ్చిమ బంగ హింసా కాండపై చర్చించేందుకు ఎయిమ్స్ రెసిడెన్షియల్ వైద్యుల బృందం అసోసియేషన్ సభ్యులు హర్షవర్ధన్ను కలిసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos