అత్తిపల్లి వద్ద అష్ట దిగ్బంధం

అత్తిపల్లి వద్ద అష్ట దిగ్బంధం

హోసూరు : తమిళనాడులో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ నెల 19 నుంచి 30 వరకు చెన్నై సహా నాలుగు జిల్లాల్లో సీల్‌డౌన్‌ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. మరో వైపు తమిళనాడు సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్ర, కేరళ రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమతమయ్యాయి. అందులో భాగంగా తమిళనాడు సరిహద్దులలో మూడు రాష్ట్రాలు వందల సంఖ్యలో సిబ్బందిని నియమించి, తమిళనాడు నుంచి వస్తున్న
ప్రజలను కట్టడి చేసే పనిలో పడింది. కర్ణాటక సరిహద్దు హోసూరు సమీపంలోని అత్తిపల్లి వద్ద భారీ పోలీసు బందోబస్తు మధ్య తమిళనాడు నుంచి వారి వివరాలను సేకరించి, వారిని మూడు రోజుల పాటు వారి ఖర్చుతో క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. మూడు రోజుల క్వారంటైన్‌ తర్వాత ఏడు రోజుల పాటు ఇళ్లకే పరిమితం కావాలని సూచిస్తూ చేతులపై సీల్ వేసి కర్ణాటకలోకి అనుమతిస్తున్నారు. తమిళనాడు నుంచి  బెంగళూరుకు వెళ్లేవారు క్వారంటైన్‌కు ఒప్పుకొంటే మాత్రమే అధికారులు కర్ణాటక సరిహద్దులోకి అనుమతిస్తున్నారు. ఈ-పాస్ ఉన్నా క్వారంటైన్
తప్పనిసరని ఆంక్షలు విధించారు. అత్తిపల్లి వద్ద కర్ణాటక అధికారుల తనిఖీలు ముమ్మరం కావడంతో హోసూరు-బెంగళూరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos