మళ్లీ కూలిన విపణి

మళ్లీ కూలిన విపణి

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా నష్ట పోయాయి. జమ్మూ-కశ్మీర్ ప్రత్యేక ప్రతి పత్తిని కేంద్రం రద్దు చేయటం మార్కెట్లను ప్రభావితం చేసింది. ఆరంభ నష్టాలను తగ్గించుకుని బీఎస్ఈ సెన్సెక్స్ 418 పాయింట్లు నష్ట పోయి 36,699.84 వద్ద, నిఫ్టీ 134 పాయింట్ల నష్టంతో 10.862 వద్ద ఆగాయి. ఉదయం సెన్సెక్స్ ఏకంగా 500 పాయింట్లకు పైగా నష్టపోయింది.ఒక దశలో అది 700 పాయింట్లు చేరుకుంది. విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఎలాగో కోలుకున్న సూచీలు నష్టాలను కొంతమేర పూడ్చు కున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.70.49గా దాకలైంది. భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, టెక్ మహీంద్రా, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ తదితర షేర్లు లాభపడగా, యెస్ బ్యాంక్, యూపీఎల్, టాటా మోటార్స్, పవర్గ్రిడ్ కార్ప్, గెయిల్ మొదలైన షేర్లు నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos