వడ్డి రేటులో కోత విపణికి వాత

వడ్డి రేటులో కోత విపణికి వాత

ముంబై: భారత రిజర్వ్‌ బ్యాంకు వడ్డీ రేట్లను పావు శాతం తగ్గించటంతో బ్యాంకుల షేర్లు కూలాయి. దరిమిలా మార్కెట్లు భారీ నష్టాల్లోకి  కూరుకు పోయాయి.  ట్రేడింగ్‌ ఆరంభంలో స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు ఆర్‌బీఐ ప్రకటన  తర్వాత కుప్ప కూలాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ ఏకంగా 300 పాయింట్లు నష్టపోయి ప్రతిష్టాత్మక 40 వేల మార్క్‌కు పతనమైంది.  నిఫ్టీ కూడా 11,900 మార్క్‌ వద్ద డోలాయమానంలో ఉంది.  మధ్యాహ్నం 12.45 గంటలకు సెన్సెక్స్‌ 333 పాయింట్లు దిగజారి 39,750 వద్ద, నిఫ్టీ 113 పాయింట్ల నష్టంతో 11,909 వద్ద ట్రేడ్‌ అయ్యాయి.  డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.28గా దాఖలైంది.  బ్యాంకింగ్‌, ఫార్మా, లోహ, ఐటీ, ఆటోమొబైల్‌, మౌలిక, ఎనర్జీ రంగాల షేర్లు నష్టాల పాలయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos