రైతుల ప్రేరణతో కార్మికులు ఉద్యమించాలి

రైతుల ప్రేరణతో కార్మికులు ఉద్యమించాలి

విశాఖపట్నం : వైజాగ్ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేయకుండా నిరోధించేందుకు సోమవారం రిలే నిరాహార దీక్షను సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఆత్మగౌరవాన్ని బలిచేసుకోబోమని స్పష్టం చేశారు. పరిశ్రమను కొనడానికి ఎవరు వచ్చినా ప్రతిఘటించాలి. ఢిల్లీలో రైతు ఉద్యమాన్ని కూడా అణగదొక్కాలని చూస్తున్నారు. అయినా రైతులు ఏమాత్రం తగ్గలేదని, అదే ప్రేరణతో ఉద్యమించాలి. మోడీ సర్కార్ ప్రభుత్వ రంగ సంస్ధలను మూసేసే ప్రభుత్వమే కాని బతికించే ప్రభుత్వం కాదు. ఇది కార్మికుల ఆస్తి, ప్రజల ఆస్తి… అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదు. రైతులను ఆందోళన జీవులని మోడీ చులకన చేసి మాట్లాడుతున్నారు. అదే దుష్ప్రచారం మనమీదా వస్తుంది దాన్నీ ఎదుర్కోవాలి. చెప్పారు. పోరాటం చేయడం కూడా దేశద్రోహమా? ఇది వామపక్ష పోరాటమని, వారే ముందుండి నడిపిస్తున్నారని అంటున్నారు. అయితే అన్ని రాజకీయ పార్టీలు భాగస్వామ్యం అవుతున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతోనే రాజకీయ ఏకాభిప్రాయం ఉండాలి. తగాదాల్లో కాదు ఉద్యమంలో పోరాడదాం” అని పిలుపు నిచ్చారు. ‘ఉత్తరాంధ్ర అభివృద్ధికి రూ.50 కోట్లు కేటాయిస్తామన్నారు. అది చేయకపోగా ఉన్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తున్నారు. జాతీయ సమైక్యత నిలబడాలంటే ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలి. విశాఖ ఉక్కును కాపాడుకోవడాన్ని జాతీయ స్థాయి ఉద్యమంలా మలిచేందుకు అందరూ ముందుకు రావాలి. విశాఖ నుంచి ఢిల్లీ స్ధాయి వరకూ పోరాటం చేయాలి.. ఉక్కును ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని అసెంబ్లీలో ఏకవాక్య తీర్మానం చేయాలి. అనేక ఇతర పార్టీలతో పార్లమెంటు సభ్యులతో జగన్ సమావేశాన్ని నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి చేసేలా చేయాలి” అని కోరారు.”తెస్తా మన్న కడప ఉక్కు రాలేదు.. ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిర్వీర్యం చేస్తున్నారు. బిజెపి చేస్తున్న ద్రోహాన్ని అందరూ తిప్పికొట్టాలి. పోరాటానికి ప్రతినిధిగా ఉంటానన్న పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో చేరటానికి ఒక మంచి అవకాశం, అవసరం. ఆత్మగౌరవం ఉన్నవారు ఎవరూ కేంద్రం ఇష్టమని అనబోరు. శిబిరానికి వచ్చి మద్దతు ఇవ్వాలి. స్వయంగా సంఘీభావం ప్రకటించాలి” అని సూచించారు.స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించాలని నీతిఆయోగ్ చెప్పిందని, నీతి ఆయోగ్ నీతిమాలిన సంస్ధ అని మండిపడ్డారు. దేశాన్ని పాలిస్తోంది నీతి ఆయోగా…. ప్రధానమంత్రా అని ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos