ఉక్కు కర్మాగారాన్ని కాపాడు కునేందుకు నిరసన

ఉక్కు కర్మాగారాన్ని కాపాడు కునేందుకు నిరసన

విశాఖ : ఇక్కడి ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం అమ్మేయటాన్ని ఆక్షేపించి అఖిలపక్ష కార్మిక సంఘాల నేతృత్వంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కూర్మన్నపాలెం కూడలి నుంచి విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. సుమారు వెయ్యి మందికి పైగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ లో 100 శాతం వాటాలను అమ్మేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు. స్టీల్ ప్లాంట్తోపాటు ఇతర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలనే లక్ష్యంతో బిజెపి ప్రభుత్వం ముందుకు సాగడం దుర్మార్గమన్నారు. ఉక్కు ప్రయివేటీకరణకు బాధ్యత వహించి నగరంలోని బిజెపి నేతలు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించడాన్ని అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఎఐటియుసి, కార్మిక సంఘాల నేతలు, కార్మికులు, తదితరులు జాతీయ జెండాలను చేపట్టి ర్యాలీలో పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos