శశిథరూర్, రాజ్‌దీప్​ అరెస్టుపై సుప్రీం స్టే

న్యూ ఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన నగరంలో జరిగిన రైతుల ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా ప్రజలను తప్పుదారి పట్టించేలా ట్వీట్లు చేశారని పోలీసులు దాఖలు చేసిన కేసుల్లో నిందితులు కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు శశి థరూర్, జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ సహా ఆరుగురు పాత్రికేయుల అరెస్టు పై అత్యున్నత న్యాయ స్థానం మంగళవారం నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై వివరణ ఇవ్వాలని కేంద్రం, ఇతరులకు తాఖీదుల్ని జారీ చేసింది. ఫిర్యాదు దార్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని వారి తరఫున న్యాయవాది కపిల్ సిబల్ విన్నవించారు. దరిమిలా రెండువారాల పాటు అరెస్టు చేయరాదని స్పష్టం చేసింది. ఆ తర్వాత అందరి వాదనలు విని తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos