బహిరంగ స్థలాల్లోని విగ్రహాల్ని తొలగించాలి

బహిరంగ స్థలాల్లోని విగ్రహాల్ని తొలగించాలి

చెన్నై: రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన నాయకుల విగ్రహాలన్నింటినీ 6 నెలల్లోపు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి ఎస్. ఎం.సుబ్ర మణియం శుక్రవారం ఆదేశించారు. లీడర్స్ పార్క్లు ఏర్పాటు చేసి అక్కడకు వాటిని తరలించాలని సూచించారు. ఇక నుంచి విగ్రహాలను హైవేలు, బహిరంగ ప్రదే శాలు, పోరంబోకు భూముల్లో ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇవ్వవద్దని కోరారు. ఇంకా విగ్రహాల ఏర్పాటుకు మార్గదర్శకాలు రూపొందించాలనీ ఆయన పేర్కొన్నారు. అనుమతి తీసుకుని ఏర్పాటు చేసిన విగ్రహాలను మాత్రమే పార్క్లో ఉంచి, వారి నుంచి వాటి నిర్వహణ ఖర్చుల్ని వసూలు చేయాలని దేశించింది. పోరంబోకు ప్రాంతంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని అరక్కోణం తాలూకా తహసిల్దారు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఎం.వీరరాఘవన్ అనే వ్యక్తి వేసిన పిటిషన్పై న్యాయమూర్తి ఈ ఆదేశాలు ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos