విశాఖలో అర్ధరాత్రి ఉద్రిక్తత..

విశాఖలో అర్ధరాత్రి ఉద్రిక్తత..

విశాఖపట్టణం నగర పాలిక అధికారుల చర్యలకు సోమవారం అర్ధరాత్రి బీచ్‌ రోడ్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీచ్‌రోడ్‌లో ఉన్న విగ్రహాల్లో నందమూరి హరికృష్ణ,అక్కినేని నాగేశ్వరరావు,దాసరి నారాయణరావు విగ్రహాలు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారంటూ నగర పాలక అధికారులు సోమవారం అర్ధరాత్రి మూడు విగ్రహాల తొలంగిపు పనులు చేపట్టారు.పగటివేళ విగ్రహాలు తొలగిస్తే అభిమానులు గొడవ చేసే అవకాశం ఉందని భావించిన అధికారులు అర్ధరాత్రి విగ్రహాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు.అయినప్పటికీ విషయం దావాలనంలా వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న అభిమానులు విగ్రహాల తొలగింపును అడ్డుకున్నారు.నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన విగ్రహాలను తొలగించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతోనే విగ్రహాలు తొలగించామంటూ అధికారులు తెలియజేశారు.ఈ మూడు విగ్రహాలను ఏర్పాటు చేసిన యార్లగట్ట లక్ష్మీ ప్రసాద్‌తో పాటు విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు.విశాఖ నగరంలోని ఆర్‌కే బీచ్‌ రోడ్డులో నగర పాలిక సంస్థ అనుమతి లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయడానిక వీలు లేదు.విశాఖ నగర పాలిక సంస్థలో చేసిన తీర్మానం ప్రకారం ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖుల విగ్రహాలను మాత్రమే సమానమైన ఎత్తులో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.ఈ మూడు విగ్రహాలు నిబంధనలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయడంతో కోర్టులో వ్యాజ్యం దాఖలు కాగా విచారణ జరిపిన హైకోర్టు విగ్రహాలను తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos