రుణ ప్రతిపాదనల్ని వ్యతిరేకించండి

రుణ ప్రతిపాదనల్ని వ్యతిరేకించండి

చెన్నై: వస్తు సేవల పన్ను-జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో గత ఐదున కేంద్ర ప్రభుత్వం చేసిన డు రుణ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఎన్డీయే ఇతర ముఖ్యమత్రులకు ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) కార్యనిర్వహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ స్టాలిన్ లేఖ రాశారు. ‘సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టేందుకు కలిసికట్టుగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎంతో అభినందనీయం. నైతికంగా, చట్ట పరంగా చూసిన రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం ఇవ్వాల్సిన అనివార్యత కేంద్రంపై ఉంది. దీనికి బదులుగా రుణాలు తీసుకోమని రాష్ట్రాలకు చెప్పడమంటే రాష్ట్రాల హక్కులను, న్యాయాన్ని కాలరాయడమే అవుతుంద’ని అందులో పేర్కొన్నారు. కేంద్రం చట్టవిరుద్ధంగా జీఎస్టీ పరిహారం పద్దు నుంచి 2017-18,2018-19లో రూ.47,272 కోట్లు కన్సాలిడేటెడ్ ఫండ్స్ ఆఫ్ ఆఫ్ ఇండియాకు మళ్లించినట్లు 2018-19 కాగ్ నివేదిక చాలా స్పష్టంగా చెబుతోందని ఆ లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos