‘సనాతన ధర్మం’పై ఇక మాట్లాడకండి

‘సనాతన ధర్మం’పై ఇక మాట్లాడకండి

చెన్నై: సనాతన ధర్మంవివాదం నుంచి బిజెపి రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నందున దాని గురించి మాట్లాడరాదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గురువారం పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ‘‘సనాతన ధర్మానికి మద్దతుగా స్పందించాలంటూ ప్రధాని మోదీ తన మంత్రులకు కొన్ని రోజుల క్రితం సూచించారు. దీనిపై రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పడానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. ఒక కేంద్రమంత్రి ప్రతి రోజూ సనాతన ధర్మంపై మాట్లాడుతూ.. ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ తన వైఫల్యాలను కప్పి పుచ్చు కునేందుకు చేస్తున్న వలలో మనం పడిపోకూడదు’’ అని స్టాలిన్ వివరించారు. బీజేపీ అవినీతిని ప్రధానంగా ప్రస్తావించాలంటూ సూచించారు. కళంకిత, మతతత్వ, నిరంకుశ బీజేపీ ప్రభుత్వం నుంచి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు కష్టపడి పనిచేయాలని కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos