సీబీఐ ద్వారా కక్ష సాధింపు

సీబీఐ ద్వారా కక్ష సాధింపు

న్యూ ఢిల్లీ: ‘సీబీఐ, ఈడీలను కేంద్రం వ్యక్తి గత కక్ష సాధింపులకు సాధనంగా మలచుకుంది.  కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని అరెస్టు చేసిన తీరే ఇందుకు నిదర్శనం’ అని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధులు రణ్‌దీప్‌ సుర్జేవాలా, సల్మాన్‌ ఖుర్షిద్‌ వ్యాఖ్యానించారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘వైఫల్యాల్ని విమర్శించే వారి అణచివేతే కేంద్రం  లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి, రూపాయి విలువ క్షీణత వంటి తీవ్రమైన అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే చిదంబరం అరెస్టు నాటకం ఆడారు. చెరసాల్లో  శిక్ష అనుభ విస్తున్న ఒక మహిళ వాంగ్మూలం  ఆధారంగా 40ఏళ్ల నుంచి ప్రజా సేవ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసారు.  చిదంబరానికి వ్యతిరేకంగా ప్రాథమిక సమాచార నివేదిక దాఖ లుకు ఎలాంటి ఆధారాలు లేవు. కనీసం అభియోగ పత్రమూ లేదు. సీబీఐ, ఈడీ అధికారుల తీరు కూడా అదే విధంగా ఉంది. పాలక పక్ష నేతల మెప్పు కోసం  వత్తాసు పలుకుతున్నారు. లేకపోతే చిదంబరాన్ని అంత హడావుడిగా అరెస్టు చేయాల్సిన అవసరం ఏముంది? చిదంబరాన్ని అరెస్టు చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రధాని నరేంద్ర మోదీకి ఈడీ, సీబీఐ అధికారులు చెబుతారని ఆశిస్తున్నా’మన్నారు. ‘చిదంబరం అరెస్టు ఎంతో బాధిం చింది.  అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు వచ్చే వరకూ ఆగకుండా  అరెస్టు చేశారు. చిదంబరం మీద ఎలాంటి కేసు ఉండదని ఆశిస్తున్నట్లు’ సల్మాన్‌ ఖుర్షీద్‌ తెలిపారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos